![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 03:47 PM
హైదరాబాద్ కేపీహెచ్‌బీ ప్రాంతంలో వర్క్ ఫ్రమ్ హోం పేరిట సైబర్ మోసానికి గురైన అనూష అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన అనూష సుమారు రూ. లక్ష నగదు పొగొట్టుకున్న తరువాత గురువారం ప్రాణాలు తీసుకుంది. చనిపోయే ముందు రాసిన లేఖలో యాప్‌ల మోసాలకు ఎవరూ బలికాకండని హెచ్చరించినట్టు తెలుస్తోంది.