![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 03:29 PM
HYDలో కల్తీ కల్లు బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని KTR పేర్కొన్నారు. 'మృతుల కుటుంబాలను వెంటనే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలి. ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలి. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలి' అని డిమాండ్ చేశారు.