|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 02:19 PM
జనగామలో బీజేపీ ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు జక్కుల నరహరి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ల బిల్లు నిజమైన బీసీ వర్గాలకు అన్యాయం చేయకుండా, సరైన న్యాయం జరిగేలా అమలు చేస్తే, బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదానికి సహకరిస్తుందని హామీ ఇచ్చారు. బీసీల హక్కులను కాపాడటమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.