|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 02:25 PM
చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షోరూమ్‌లో దుండగులు దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు దుండగులు సిబ్బందిపై కాల్పులు జరపగా.. డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. షోరూమ్ ఓపెన్ చేయగానే మాస్కులు, హెల్మెట్లతో దుండగులు వచ్చారు. దుండగులు తుపాకులతో బెదిరిస్తూ లోపలికి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
హైదరాబాద్‌లో అదుపుతప్పిన లా అండ్ ఆర్డర్
బీహార్ తరహాలో పట్టపగలే గన్నులు పట్టుకొని చోరీలు
ఖజానా జువెలర్స్‌లో చోరీ జరిగిన సీసీటీవీ దృశ్యాలు
చందానగర్ ఖజానా జువెలర్స్‌లో చొరబడి ఆభరణాలు దొంగిలించిన దొంగలు
అడ్డుకున్న అసిస్టెంట్ మేనేజర్ కాలు తొడపై గన్‌తో కాల్చిన దొండగులు https://t.co/wvbwdFtcm8 pic.twitter.com/iGw4aJc6zq
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2025