|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 02:17 PM
TG: హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాప్‌లోకి ఉదయం 10.30 గంటలకు దొంగల ముఠా చొరబడిందని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. వారి కాల్పుల్లో డిప్యూటీ మేనేజర్ గాయపడ్డారని..అతడి పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. దుండగులు బంగారు ఆభరణాలు ఉన్న కౌంటర్లను తెరవలేకపోయారని పేర్కొన్నారు. వెండి ఆభరణాలు ఉన్న కౌంటర్లు ధ్వంసం చేసి వెండి వస్తువులు ఎత్తుకెళ్లారని CP తెలిపారు. వెండి ఎంత ఎత్తుకెళ్లారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదన్నారు.