|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 02:11 PM
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజలకు అత్యవసరమైతేనే బయటకు రావాలని, మధ్యాహ్నం 3 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. సాయంత్రం షిఫ్టులో పనిచేసేవారు ఇంటి నుంచే పని చేసేలా ప్లాన్ చేసుకోవాలని కోరారు.