|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 02:29 PM
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మంగళవారం అప్పన్నపల్లి ఫ్లైఓవర్ సమీపంలో రూ. 2.5 లక్షలతో నిర్మించిన నూతన బస్ షెల్టర్ ను ప్రారంభించారు. మహబూబ్ నగర్ నగరాన్ని రూ. 250 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, 20 పార్కులను గుర్తించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలను విస్మరించిందని ఆరోపించారు. గత 75 ఏళ్లలో జరగని అభివృద్ధిని 16 నెలల్లో చేసి చూపించామని స్పష్టం చేశారు.