|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 11:33 AM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కి లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ అడ్డగోలుగా అసత్యపూరితంగా చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు. ఒక కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మరొక ప్రజాప్రతినిధిపై అసత్యపూరిత ఆరోపణలు చేయడం దుర్మార్గం. కేవలం రాజకీయ ఉనికి కోసమే కేటీఆర్ పైన అసత్యపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని నోటీసులో పేర్కొన్న న్యాయవాదులు. కేటీఆర్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని బండి సంజయ్‌కి లీగల్ నోటీసులో పేర్కొన్న న్యాయవాదులు. భవిష్యత్తులో అడ్డగోలుగా అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని డిమాండ్. లేకుంటే తదుపరి లీగల్ నోటీసుతో పాటు, చట్టంలో అందుబాటులో ఉన్న క్రిమినల్ చర్యలకు కూడా బండి సంజయ్ బాధ్యుడు అవుతారని హెచ్చరిక