|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 11:09 AM
భారీ వర్షానికి జలమయమైన వరంగల్ నగరం. నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు..డిపోలకే పరిమితమైన బస్సులు. కాశీబుగ్గ, రంగశాయిపేట, కరీమాబాద్ లాంటి ప్రాంతాల్లో మోకాళ్ల లోతుకు చేరిన వరద నీరు. లోతట్టు ప్రాంతాల్లో షాపులు, ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు, ఇబ్బంది పడుతున్న ప్రజలు. గడిచిన 12 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో యావరేజ్‌గా 92.9 మి.మీగా నమోదైన వర్షపాతం . అత్యధికంగా సంగెంలో 202.4 మి.మీ గా నమోదవ్వగా, ఖిలా వరంగల్ ప్రాంతంలో 148.5 మి.మీ, వర్ధన్నపేటలో 93.3 మి.మీ, పర్వతగిరిలో 107.5 మి.మీగా నమోదైన వర్షపాతం