|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 10:47 AM
దేవరకద్ర నియోజకవర్గం, చిన్న చింతకుంట మండలం, దమగ్నాపూర్ గ్రామంలో కొత్తకోట మున్సిపాలిటీకి చెందిన మాజీ కౌన్సిలర్ బాలయ్య, కొండారెడ్డితో పాటు సుమారు 30 కుటుంబాలు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తాము కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.