|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 10:46 AM
నాగర్ కర్నూల్ జిల్లాలోని నార్లాపూర్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సంతోష్, రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులు, భూనిర్వాసితులతో సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్వాసితుల పునరావాసమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు.