|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 03:12 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తనను పార్టీలోకి తీసుకునేటప్పుడు, రెండోసారి హామీ ఇచ్చేటప్పుడు తాము అన్నదమ్ములమని రేవంత్ రెడ్డికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తామిద్దరం సమర్థులమని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులు ఉండగా, నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా తనకు, తన సోదరుడికి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.