|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 03:14 PM
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్కెఎన్ఆర్ జూనియర్ కళాశాల వద్ద మంగళవారం అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ఇరుగురాల భూమేశ్వర్ మాట్లాడుతూ గంజాయికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు వెన్న మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అక్రమాలీక్, ఉపాధ్యక్షులు మంద రాకేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ భుక్య రాథోడ్ పాల్గొన్నారు.