|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 02:57 PM
పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ బాలుర కాలేజీ హాస్టల్ ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హాస్టల్ అధికారిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వాచ్‌మన్ సంజేశ్వరరావుపై కూడా వేటు వేశారు. దాడికి పాల్పడిన విద్యార్థులను హాస్టల్ నుంచి పంపించేయాలని ఆదేశించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై సెకండియర్ విద్యార్థులు దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.