|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 07:22 PM
శేరిలింగంపల్లి డివిజన్ లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రూ. 15 కోట్ల 83 లక్షల వ్యయంతో శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.. వెంకట్ రెడ్డి కాలనీ, బృందావనం కాలనీ, పాపిరెడ్డి నగర్, సుదర్శన్ నగర్ కాలనీ, భాగ్య లక్ష్మి నగర్ ఫేస్-2, శిల్పా గార్డెన్స్, వెంకటేశ్వర కాలనీ, సెంట్రల్ పార్క్ ఫేస్ -2, కామ్లెట్ కాలనీ, శ్రీ మారుతీ నగర్, సీఎంసీ లేఔట్, ఇందిరానగర్ లలో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల పనులకు కల్వెర్ట్, బాక్స్ డ్రైన్ మరియు ఆర్ సీసీ బాక్స్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసిన పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరేఖపూడి గాంధీ , శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని కాంగ్రెస్ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దీక్షుచిగా మారిందన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, వార్డ్ మెంబర్ రాంబాబు, వార్డ్ మెంబర్ శ్రీకళ, వార్డ్ మెంబర్ రాము, SLVDC ప్రెసిడెంట్ రవి యాదవ్, గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్, సుదర్శన్ నగర్ కాలనీ యూత్ ప్రెసిడెంట్ రమేష్, ఇందిరానగర్ కాలనీ ప్రెసిడెంట్ అఫ్జల్ తదితర కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్లు మెంబర్లు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.