|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 12:36 PM
రాజేంద్రనగర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళవారం ఇషా బ్లూమ్ గర్ల్స్ హాస్టల్ లో సుస్మిత (19) అనే విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా అక్కునూరు గ్రామానికి చెందిన సుస్మిత, వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సుస్మిత ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను ఆరా తీస్తున్నారు.