|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 12:40 PM
చందానగర్ ఖజానా జ్యువెలరీ షాప్‌లో దొంగతనం యత్నం జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో, దొంగలు అడ్డువచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో సెక్యూరిటీ సిబ్బందికి బుల్లెట్ గాయాలైనట్లు నిర్వాహకులు తెలిపారు. అంతకుముందు కూకట్‌పల్లిలో రెండు చోట్ల చోరీలకు పాల్పడిన దుండగులే ఇక్కడికి వచ్చి ఈ దొంగతనం యత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కాల్పుల ఘటనపై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జ్యువెలరీ నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకుని, సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. జిల్లా సరిహద్దుల్లో పోలీసులను అప్రమత్తం చేసి, నిందితుల కోసం 10 బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.