|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 07:44 PM
తెలంగాణలో పెద్ద ఎత్తున రహదారులను అభివృద్ధి చేస్తామని DyCM భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమంలో హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (HAM) విజన్ డాక్యుమెంట్ ను ఆయన విడుదల చేసి మాట్లాడారు. ప్రతి గ్రామాన్ని మండల కేంద్రానికి, ప్రతి మండలాన్ని జిల్లా కేంద్రానికి, ప్రతి జిల్లాను రాష్ట్ర రాజధానికి కలిపే విధంగా రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. హ్యామ్ రోడ్డు పనుల్లో చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం కల్పిస్తామన్నారు.