|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 03:09 PM
శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను, ప్రస్తుతం 589.60 అడుగులకు చేరింది. 1,77,137 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో, అధికారులు 16 గేట్లను ఎత్తి 1,70,752 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.