|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 03:29 PM
నిర్మల్ పట్టణంలోని శ్రీ నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మాలేపు విష్ణు చారిని విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. విశ్వకర్మ సంఘం అధ్యక్షులు చింతల రవీందర్ మాట్లాడుతూ, విశ్వకర్మలు అన్ని రంగాల్లో రాణించాలని, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాల్లో ఉన్నత పదవులు పొంది సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఇనుగుర్తి రమేష్ చారి, కోశాధికారి సనుగుల దేవిదాస్ చారి, తాటికొండ స్వామి, సభ్యులు పాల్గొన్నారు.