|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 07:08 PM
TG: కల్వకుర్తి అన్ని మోటార్లను వెంటనే ఆన్ చేయాలని BRS నేత మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. 'నాగర్‌కర్నూల్ జిల్లాలో మొత్తం చెరువుల సామర్థ్యం 6.28 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.55 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. వనపర్తి జిల్లాలో 222 చెరువులు ఉండగా, 54% చెరువులు ఇంకా నిండలేదు. మొత్తం చెరువుల సామర్థ్యం 4.23/8.39 టీఎంసీలుగా ఉంది. మోటార్లు వెంటనే ప్రారంభించకపోతే రైతులతో కలిసి ప్రజా ఉద్యమం చేస్తాం' అని హెచ్చరించారు.