|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 03:17 PM
TG: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ ఎంపీల అరెస్టును సీఎం రేవంత్ ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా ర్యాలీ చేస్తే అడ్డుకుంటారా? మండిపడ్డారు. కాగా, కాసేపటి క్రితం ఢిల్లీలో బీజేపీతో కుమ్మక్కై ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఇండియా కూటమి ర్యాలీ నిర్వహిస్తుండగా రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీలు అరెస్ట్ అయ్యారు. ఈసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి బస్సులో తరలించారు.