|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 07:12 PM
శ్రావణ మాసం మూడవ సోమవారం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని 48,950 మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో రాధాబాయి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం, పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. భక్తులు ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించి, కోడె మొక్కులు, ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, ఎస్‌పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షణ చేశారు. దాదాపు 40 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాజన్న ఆలయ అనుబంధ ఆలయమైన బద్ది పోచమ్మ ఆలయంలోనూ రద్దీ నెలకొంది. అమ్మవారిని దర్శించుకొని నైవేద్యం సమర్పించి బోనాల మొక్కులు చెల్లించుకున్నారు.