|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 07:13 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొహినాబాద్ మండలంలోని పలు గ్రామాలలో సోమవారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా అకాల వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొర్లుతున్నాయి. వర్షం వల్ల రైతులు కూలి పనులు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇలాంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.