![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 02:55 PM
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. కాగజ్‌నగర్ లోని వారి నివాసంలో ఆయన మాట్లాడుతూ.. సిర్పూర్ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఇంటికి చేరేలా చూడాలని ఎమ్మెల్సీ తెలిపారు. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్య దర్శి బుర్స వెంకటేశ్ ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్సీ సన్మానించారు.