![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 08:43 PM
భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా.. 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి పొంగులేటి తెలిపారు. తొలివిడతలో 7వేల మందికి 33 కేంద్రాల్లో మే 26 నుంచి శిక్షణ ప్రారంభించగా ఈనెల 26తో 50 రోజుల శిక్షణ పూర్తవుతుందని ప్రకటించారు. మిగిలిన 3వేల మందికి ఆగస్టు 2వ వారం నుంచి శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు.