|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 04:41 PM
టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఆఫర్ లెటర్లు ఇచ్చి, ఆపై జాయినింగ్ తేదీలు ఇవ్వడం లేదని పలువురు బాధితులు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ఫిర్యాదు చేశారు. వివిధ కంపెనీల్లో రెండేళ్ల నుంచి ఎనిమిదేళ్ల మధ్య అనుభవం ఉన్న ఉద్యోగులకు టీసీఎస్ కొలువులు ఆఫర్ చేసినట్లు వారు తెలిపారు. ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు నాస్‌సెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనెట్ బాధితుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.దాదాపు 600 మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చి, జాయినింగ్ తేదీలో మాత్రం జాప్యం చేస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. దీని కారణంగా ఉద్యోగులు ఆర్థికంగా, మానసికంగా, వృత్తిపరంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.