|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 08:12 PM
సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ నాలా విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు సూచించారు. శుక్రవారం హైడ్రా కార్యాలయంలో నాలా పనులపై కంటోన్మెట్ సీఈవో శ్రీ మధుకర్ నాయక్ తో కలిసి ఈ విషయమై సమీక్షించారు. హైడ్రా, హెచ్ ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ, కంటోన్మెంట్ అధికారులతో చర్చించారు. భారీ మొత్తంలో వచ్చిన వరద ప్యాట్నీ పరిసరాల్లో నాలా కుంచించుకుపోవడంతో పై భాగంలో ఉన్న ఆరేడు కాలనీలు నీట మునిగేవని.. ఇప్పుడు విస్తరించడంతో ఆ ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మించడానికి ప్యాట్నీ పరిసరాల్లో అభ్యంతరం చెప్పడంతో ఆగాయని.. ఇటీవల వరద ముంచెత్తడంతో వెంటనే ఈ పనులు పూర్తి చేయాల్సినవసరం ఉందని అందరూ గ్రహించారన్నారు. వెంటనే ఈ పనులు పూర్తి చేస్తే ప్యాట్నీ ప్రాంతం కూడా భద్రంగా ఉంటుందని హైడ్రా కమిషనర్ సూచించారు.