|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 07:22 PM
ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవం సందర్భంగా ఫర్టీ9 ఫెర్టిలిటీ సరికొత్త ఆవిష్కరణకు తెరలేపింది. మగవారి వీర్యకణాల పరీక్ష కోసం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత 'లెన్స్హుక్ X12 ప్రో' సాంకేతికతను అందుబాటులోకి తెచ్చినట్లు సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించింది. ప్రముఖ సినీనటి లయ, ఫర్టీ9 సేవలు పొంది సంతాన సాఫల్యం పొందిన దంపతులతో కలిసి ఈ సాంకేతిక మైలురాయిని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో అగ్రగామి ఐవిఎఫ్ సెంటర్‌గా ఉన్న ఫర్టీ9, ఆరోగ్య సేవల్లో ఏఐని ప్రవేశపెట్టడం ద్వారా మరింత సమర్థవంతమైన ఫలితాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా "టుగెదర్ఇన్ఐవిఎఫ్" క్యాంపెయిన్‌లో భాగంగా కేక్ కటింగ్ నిర్వహించారు. భారతదేశంలో తగ్గుతున్న ఫర్టిలిటీ రేటు (1.9) ఆందోళన కలిగిస్తుందని, ముఖ్యంగా మగవారిలో సంతానలేమి సమస్యల పరిష్కారం అత్యవసరమని ఫర్టీ9 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి బుడి తెలిపారు. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ సమస్యలు మిస్క్యారేజ్ రేట్లను పెంచుతున్నాయని పేర్కొన్నారు. సరికొత్త ఏఐ టెక్నాలజీతో నిమిషాల వ్యవధిలో వేల వీర్యకణాలను పరిశీలించి డీఎన్ఏ లోపాలను ఖచ్చితంగా గుర్తించవచ్చని ఆమె వివరించారు. దీనివల్ల సరైన చికిత్స అందించడం, వీర్యకణాల నాణ్యతను పెంచడం సులభతరమవుతుందని డాక్టర్ జ్యోతి అన్నారు. "సంతానలేమితో వస్తున్న కేసుల్లో 50% మగవారిలోనే సమస్యలు ఉంటున్నప్పటికీ, 95% మంది మహిళలే కన్సల్టేషన్‌కు వస్తున్నారు. అందుకే ఏఐ ఆధారిత సెమన్ అనలైజర్‌ను తీసుకొచ్చి ఖచ్చితమైన డేటాతో చికిత్స అందిస్తున్నాం. ఇది అనవసర అడ్డంకులను తొలగించి, దంపతుల్లో నమ్మకాన్ని పెంచుతుంది," అని ఫర్టీ9 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ వినేష్ గదియా తెలిపారు.
'టుగెదర్ఇన్ఐవిఎఫ్' క్యాంపెయిన్ కింద, ఫర్టీ9 దంపతులకు అసెస్మెంట్ ప్యాకేజ్‌ను కేవలం ₹599కే అందిస్తోంది. ఇందులో సంతాన సాఫల్య నిపుణుడితో కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, ఏఎమ్‌హెచ్ టెస్ట్, సెమన్ అనాలసిస్ ఉంటాయి. జూలై 31 వరకు ఐయూఐ చికిత్సపై 50% తగ్గింపు, ఐవిఎఫ్ చికిత్సపై 25% తగ్గింపు అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ AI టెక్నాలజీతో ఫర్టీ9 ఫెర్టిలిటీ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.