|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 11:19 AM
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రి, కుమార్తె మృతి చెందారు. శంషాబాద్ వర్ధమాన్ కళాశాలలో బీటెక్ చదువుతున్న తన కుమార్తె మైత్రిని కాలేజీకి పంపించేందుకు బైక్‌పై బస్టాప్‌కు బయలుదేరారు. షాద్‌నగర్ చౌరస్తా వద్దకు రాగానే వీరి ద్విచక్రవాహనాన్నిలారీ ఢీకొట్టింది. మచ్చేందర్ ఘటనాస్థలిలోనే మృతి చెందగా, మైత్రికి తీవ్రగాయాలై లారీ టైర్ల మధ్యలో ఇరుక్కు పోయింది. కాసేపటికి మైత్రి కూడా కన్నుమూసింది. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.