|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 07:38 PM
పటాన్చెరు : నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన సురేష్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంలో బాధపడుతున్నారు. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. చికిత్స నిమిత్తం రెండు లక్షల రూపాయల ఎల్ఓసి మంజూరు అయింది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సురేష్ కుటుంబ సభ్యులకు ఎల్ఓసి అనుమతి పత్రాలను ఎమ్మెల్యే జిఎంఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, పాండు, కాశి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.