![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 08:42 PM
చింతపల్లి మండల పరిధిలోని వింజమూరు శివారులో శుక్రవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఎస్సై రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు సాయంత్రం నాలుగు గంటల సమయంలో దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని నాలుగు బైకులు, నాలుగు సెల్ ఫోన్లు 12,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.