|
|
by Suryaa Desk | Thu, Jul 24, 2025, 01:45 PM
సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతురాలు ఖమ్మం జిల్లాకు చెందిన 27 ఏళ్ల చింతల యామిని అని గుర్తించారు.
యామిని గచ్చిబౌలి ప్రాంతంలోని ఇందిరానగర్‌లోని ఒక పీజీ హాస్టల్‌లో నివాసముండుతూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా సేవలు అందిస్తోంది. మంగళవారం ఉదయం ఖమ్మం వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు బయలుదేరిన ఆమె, కొద్దిసేపటికే తిరిగి హాస్టల్‌కు చేరి ఉరివేసుకుని తన జీవితం ముగించుకుంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌కి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోయినా, ఆమె ఫోన్ కాల్ డేటా రికార్డులు పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ప్రాథమికంగా పెళ్లి ఒత్తిడే ఈ ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం తీసుకుంటామని, పూర్తి విచారణ అనంతరం మరింత సమాచారం వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.