![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 06:59 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో ఉన్నారో బీజేపీనా, బీఆర్ఎస్ నా, లేక ఇంకేదైనా పార్టీనా అన్నది ప్రజలకు అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఆమె మాటల్లో స్థిరత్వం లేదని, రాజకీయ స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
మహేష్ గౌడ్ మాట్లాడుతూనే కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటీవల కవిత చేసిన "బీఆర్ఎస్ లో దెయ్యాలు ఉన్నాయ్" వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ – “ఆ దెయ్యాలెవరు? వారి పేర్లు చెప్పకపోవడంలో ఉద్దేశ్యం ఏమిటి?” అని ప్రశ్నించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా కామెంట్లు చేయడం తగదని గౌడ్ సూచించారు.
శనివారం హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “బీఆర్ఎస్ నుంచి దెయ్యాలు వెళ్లిపోయాయా? లేక ఇంకా ఉన్నాయి? నిజంగా ఏమైనా ఉన్నా స్పష్టత ఇవ్వాలి” అంటూ అన్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.