![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 11:25 AM
నిజామాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. భారీ దారి దోపిడీ జరిగిన ఘటన నిజామాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రాండ్ న్యూ సెల్‌ఫోన్ల లోడ్‌తో ఓ ట్రక్కు హైదరాబాద్ కు వెళ్తోంది. ఈ క్రమంలోనే ట్రక్ డ్రవర్ టేక్రియాల్ వద్ద విశ్రాంతి తీసుకునేందుకు ఆగాడు. కాసేపు నిద్రపోయి లేచి చూసే సరికి ట్రక్కులో వెనుక వైపు ఉన్న సెల్‌ఫోన్లు ఉన్న డబ్బాలు మాయం అయ్యాయి. దీంతో డ్రైవర్ వెంటనే నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ గురైన సెల్‌ఫోన్ల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.10 లక్షలకు పైగా ఉంటుందని డ్రైవర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.