![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 02:53 PM
TG: పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో చోటు చేసుకుంది. వెల్దుర్తి భారతమ్మ(65), కవిత (26) గురువారం రాత్రి ఇంట్లో పడుకున్నారు. శుక్రవారం ఉదయం ఎంత సేపైనా వారు బయటకురాకపోవడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా అనుమానాస్పద స్థితిలో మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.