![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 03:32 PM
మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న కాంగ్రెస్ హామీని అమలు చేయాలని MLC కవిత డిమాండ్ చేశారు. రంగారెడ్డి(D) షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్(M) కాకునూరు గ్రామంలోని మహిళలతో కలిసి పోస్టు కార్డు ఉద్యమంలో పాల్గొని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పోస్టు కార్డులు రాశారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు తెలంగాణలోని మహిళలందరం పోస్టు కార్డు ఉద్యమం ద్వారా తమ నిరసనను కాంగ్రెస్‌కు తెలియజేస్తూనే ఉంటామన్నారు.