42% రిజర్వేషన్లతో రాజకీయాలలో మారనున్న బీసీల దశ : నీలం మధు ముదిరాజ్...
by Suryaa Desk |
Sun, Jul 13, 2025, 11:28 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఈ నిర్ణయంతో రాజకీయాలలో బీసీల దశ మారనుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శనివారం హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముదిరాజ్, బీసీ రాష్ట్ర నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గార్లను కలిసి పుషగుచ్ఛం ఇచ్చి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ను శాలువ, జ్యోతీరావు పూలే ప్రతిమ ఇచ్చి ఘనంగా సత్కరించారు.
అనంతరం నీలం మధు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో రాజకీయంగా బీసీలకు మహర్దశ రానుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లలోను కులవర్గీకరణ చేసి అధికంగా ఉన్న ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఎ లోకి మార్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ సామాజిక న్యాయం దిశగా పాలన చేస్తు అన్ని వర్గాలకు పెద్ద పీట వేస్తూ సమన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ లోకమంతా ఋణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చొప్పరి శంకర్ - మనముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, DL పాండు హైకోర్ట్ అడ్వకేట్, పులిమామిడి రాజు - ముదిరాజ్ సంఘం అధ్యక్షులు సంగారెడ్డి, బలరాం-జర్నలిస్ట్, చోక్కల రాములు- ముదిరాజ్ సంఘం అధ్యక్షులు సిరిసిల్ల, ఉప్పరి నారాయణ - దుబ్బాక, మద్దెల సంతోష్- మన ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి, రామచందర్ - DFCS అధ్యక్షులు సిరిసిల్ల జిల్లా, సుంకరబోయిన మహేష్ -మత్స్యశాఖ డైరెక్టర్ సంగారెడ్డి జిల్లా,దేవరాజ్- ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షులు, రంజిత్ హుజూర్నగర్, శేఖర్-గజ్వేల్ తదితరులు పాల్గొన్నారు