|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 05:55 PM
ఆధార్ అప్ డేషన్ ప్రత్యేక క్యాంపును ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లోని ఆధార్ అపడేషన్ ప్రత్యేక క్యాంపును జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఆధార్ కార్డు వివరాలను అప్ డేట్ చేసుకునేందుకు ప్రత్యేక క్యాంపు కలెక్టరేట్ లో ఏర్పాటు చేశామని, ఆగస్టు 8 వరకు జరిగే ఆధార్ అప్ డేట్ ప్రత్యేక క్యాంప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.