|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 06:35 PM
తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనల అనంతరం లోకల్ రిజర్వేషన్‌లపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో వరుసగా 9, 10, 11, 12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందన్న నిబంధనలను సవాల్ చేస్తూ నీట్ విద్యార్థులు పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం.. తీర్పు రిజర్వ్ చేసింది.