|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 06:36 PM
రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం కమిషన్ల పేరిట రిపోర్టులు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల వస్తున్న ఆరోపణలు నిరాధారమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన ప్రెజెంటేషన్‌ను ఆదిలాబాద్ లోని బిఆర్ఎస్ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆయన వీక్షించి ప్రభుత్వం తీరును ఖండించారు.