![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 03:39 PM
అంతర్జాతీయ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రముఖ ప్రభుత్వ సర్జన్ డా. పెంచలయ్య కి ఉత్తమ సర్జన్ గా ప్రశంసా పత్రం అందజేశారు. గత సంవత్సరం జిల్లాలో అత్యధిక ఆపరేషన్లు చేసినందుకు ఈ పురస్కారం లభించింది. ఇదే పురస్కారాన్ని గతంలో ఐదు సార్లు వివిధ ప్రాంతాల్లో అందుకున్నారు.