![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 03:37 PM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవకతవకలపై దర్యాప్తు వేగం పెరిగింది. ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా రంగంలోకి దిగింది. ఇప్పటికే రెండు కేసులు ఈడీ వద్ద ఉన్న నేపథ్యంలో, తాజాగా మరిన్ని వివరాలను పొందేందుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీకి ఈడీ లేఖ రాసింది. అవకతవకల వివరాలను తమకు అప్పగించాలని కోరింది.
సీఐడీ నుంచి సమాచారం అందిన వెంటనే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించనున్నట్లు ఈడీ వెల్లడించింది. హెచ్‌సీఏలో జరిగిన అక్రమాలపై ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వ్యవహారంలో నిధుల దుర్వినియోగం, ఫ్రాడ్, బలవంతపు ఒత్తిళ్లపై దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. సంస్థ లోపలే కీలక వ్యక్తుల ప్రమేయంపై కేంద్ర ఏజెన్సీ విచారణ చేస్తుంది.
ఇకపై పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) యాజమాన్యాన్ని బెదిరించిన కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టయ్యారు. ఈ వ్యవహారం రాజకీయంగా, క్రీడా వర్గాల్లో కలకలం రేపింది. తాజా పరిణామాలతో హెచ్‌సీఏపై మరింత తీవ్ర దర్యాప్తు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.