![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 08:15 PM
కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని ఓర్వలేక రేవంత్ నీళ్లు ఆపుతున్నాడని BRS నేత హరీశ్ ఆరోపించారు. 'కృష్ణా నదిలోకి నీళ్లొచ్చి 36 రోజులైనా కల్వకుర్తి మోటార్లు స్టార్ట్ చేయలేదు. మేము ప్రశ్నిస్తే మోటార్లు ఆన్ చేశారు. KCR మీద, నా మీద కోపం ఉంటే మా మీద కేసులు వెయ్యి. మేడిగడ్డ కుంగిన 2 పిల్లర్లు రిపేర్ చేస్తే 6 నెలల్లో అంతా మంచిగా అవుతుంది. కళ్ల ముందు నీళ్లు పోతున్నాయి కానీ రైతులకు నీళ్లు ఇవ్వట్లేదు' అని విమర్శించారు.‘‘వర్షాలకు గోదావరిలో 8 లక్షల క్యూసెక్కులు వృథాగా పోతున్నాయి. మోటార్లు ఆన్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నారు. మోటార్లు ఆన్ చేస్తే వారం రోజుల్లో రంగనాయకసాగర్ నిండిపోతుంది. మేడిగడ్డ కూలితే మోటార్లు, లారీలు ఎలా నడుస్తున్నాయి? రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లు కాళేశ్వరంలో భాగం కావా? ఇవేమీ చూడకుండా కాళేశ్వరం కూలిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చపెడితే.. మీరేం చేశారో.. మేమేం చేశామో మాట్లాడుకుందాం.