![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 08:20 PM
జిల్లాలో నామినేట్ పోస్టుల్లో మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుందని INTUC జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాములు అన్నారు. శనివారం ఖమ్మం నగరంలో నిర్వహించిన మున్నూరు కాపు ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేట్ పోస్టులకు సంబంధించి జిల్లా మంత్రులు చొరవ తీసుకొని మున్నూరు కాపులకు న్యాయం జరిగే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు నరేష్ మోహన్ నాయుడు, గుండాల కృష్ణ, తదితరులు ఉన్నారు.