![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 02:24 PM
TG: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని కిష్టాపురం గ్రామ శివారులోని అడవిలో శనివారం ఓ మహిళ కుళ్ళిపోయిన మృతదేహం లభ్యమైంది. పోలీసుల దర్యాప్తులో.. మృతురాలు ఖమ్మం(D) కామేపల్లి(M) టేకులతండాకు చెందిన భూక్య అసలీ (40)గా గుర్తించారు. భర్తకు దూరంగా ఉంటున్న అసలీ.. మదన్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. కాలక్రమంలో వీరి మధ్య వివాదం తలెత్తడంతో మదన్ ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు. గుండాల సహాయంతో అడవిలోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు.