![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 03:17 PM
తెలంగాణ EAMCET వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ శుక్రవారంతో పూర్తయింది. మొత్తం 95,256 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోగా, వారిలో 94,059 మంది 56.63 లక్షల వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఓ విద్యార్థి అత్యధికంగా 1,051 ఆప్షన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. జూలై 13న మాక్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. విద్యార్థులు జూలై 14, 15న వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంది. తుది సీట్ల కేటాయింపు జూలై 18న జరగనుంది.