|
|
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 03:15 PM
కుత్బుల్లాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం యుఎస్ఎఫ్ఐ మెడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో భౌతిక సౌకర్యాలు, మిడ్డే మీల్ నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలను స్వయంగా పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. పౌష్టికాహారం కలిగిన భోజనం ద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటం అవసరమన్నారు. ప్రస్తుత భోజన వ్యవస్థలో లోపాలను ప్రభుత్వం గుర్తించి, వాటిని తక్షణమే సరిచేయాలని కోరారు.
చంద్రకాంత్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మంచివిద్య, ఆరోగ్య భోజనం, మెరుగైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వమే ముందడుగు వేయాలన్నారు. విద్య అనేది ప్రతి విద్యార్థికి సమానంగా లభించాలన్నదే యుఎస్ఎఫ్ఐ లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు.