![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 03:40 PM
నల్గొండ (D) తుంగతుర్తిలో ఈ నెల 14న సీఎం రేవంత్ చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగనుంది. తద్వారా 11.30 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. గడిచిన ఆర్నెళ్లలో రాష్ట్రంలో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసింది. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422 కు చేరుతుంది. మొత్తంగా 3 కోట్ల 14 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.