![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 02:17 PM
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన నిన్న మరోమారు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో ఆయన హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.అనారోగ్యంతో వారం రోజుల క్రితం ఆయన యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఈ నెల 5వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఆ సమయంలో వారం తర్వాత మళ్లీ ఆసుపత్రికి రావాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఆయన నిన్న ఉదయం ఆసుపత్రికి వెళ్లి జాయిన్ అయ్యారు. ఆసుపత్రిలో అన్ని పరీక్షలు చేయించుకున్న అనంతరం కె. చంద్రశేఖర్ రావు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన వెంట ఆయన సతీమణి శోభ, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ తదితరులు ఉన్నారు.